20, మే 2009, బుధవారం

అంతా మన మంచికే

'అనగనగా,ఇంకా అనగా, ఇంకొంచెం అనగా , ఒక రాజు ఆ రాజుకో...'
రాజు కి కోపం వచ్చింది.
" ఎంత కధలో మనిషినైతే మాత్రం నన్ను రాజు అని తేలిగ్గా తీసిపారేయటం ఏమీ బాగోలేదు. రాజేమిటి రాజు? ఓ కోమటి లాగానో ఓ చాకలి లాగానో ? చక్రవర్తి అనో సార్వభౌముడనో అంటే నీ ప్రాణం పోతుందా?"

పోదు మహాప్రభో పోదు.
'అనగనగా ఓ ప్రభువు. ఆ ప్రభువుకో మహారాణి.'

ఈసారి మహారాణి కి కోపం వచ్చింది.
"ప్రభువుకో మహారాణి ఏమిటి. నేనేమన్నా ఓ వస్తువునా? ఆ ప్రభువు కి సంబంధించిన ఆస్తినా? ప్రభువుకో కుక్క అంటే కుక్క ఒప్పుకుంటుందేమో నేను ససేమిరా."
సరే సరే. క్షంతవ్యుడను.
'ప్రభువు, ఒక మహారాణిన్నూ. మహారాణి జన్మతః మహారాణి. అంటే ఆ దేశపు ప్రజలందరూ ఆమెను మహారాణిగా బేషరతు గా అంగీకరిస్తారన్నమాట. ఆ మాటకొస్తే ప్రభువు ని కూడా మహారాణి ఆమోదిస్తేనే ప్రజలు ఆమోదిస్తారు'.
కధలో ఈ వాక్యాన్ని రాజు రాణి కూడా ఆమోదించారు.
'రాణికి ఉంది శక్తి
రాజుకి ఉంది యుక్తి.
యువరాజు కి ఉంది ఉభయుల మీదా భక్తి.
రాణి గారి అంతరంగికులలో కొంతమందికి ఉంది కుయుక్తి.
అన్నీ తెలిసి కూడా ప్రజలకి దేశం మీదఅనురక్తి.
ఐదేళ్ళపాటు అందరికి సందిగ్ధత నించి విముక్తి.

కధ మంచికే మనం ఇంటికే.'

26, ఏప్రిల్ 2009, ఆదివారం

दिल क्या करे जब किसीको किसीसे प्यार हो जाये !

హృదయం ఏమి చేస్తుంది ఎవరికో ఎవరితో ప్రేమ ఐపోతే !

( నీ బొంద లా ఉంది తర్జుమా , మళ్లీ ప్రయత్నం చెయ్యరా )

గుండె ఏం చేయాలె ఎవనికో ఎవతితోనో ప్రేమ అయినంక
( మొదటి ఏడుపే బెటరు ) గట్లనా అయితే కాస్కో

పిల్ల పిల్లోడు ప్రేమించుకున్నరు గంద ఇంక గుండె కా యేమి చేస్తుందన్నట్లు

( నీ రాతలు ఆపాలంటే నీకు ఏం కావాలన్నట్లు ?)

ప్రేమించిన గుంట డేవ్వడో దేల్వది. ఏ గుంట ని ప్రేమిచిండో దేల్వది. అయినా నాకు దేల్వక అడుగుత. గుంటడు గుంట మధ్య ఇష్కయినంక గుండె ఏం జేస్తే ఏమంట ఏం జెయ్యక పొతే ఏమంట ? బీచ్మె ఈ సిద్ధాంతాలు జెప్పే వానికి దురద ఎందుకంట.

(కానీ నాయనా రోకటి పోటుకు వెరువనేల)

గయినా గుండెలతో నే నంట గద ప్రేమించుకునేటిది. చేసిందంతా చేసి ఈ గుండె కాయ ఏం చేయ్యగలదు ఏంది. దిల్ క్యా కరే అంట దిల్ క్యా కరే ?
( నిన్నెవరు ఆపగలరు GO AHEAD)

గుంట దో దిల్, గుంతడిదో దిల్ ,వ్యాఖ్యానం వెలగ బెట్టె టాయందో దిల్,ఎవ్వరిదీ గాందో దిల్. మొత్తం నాలుగు దిల్ లు.
ఈ దిల్ క్యా కరే దిల్ ఎవరిదీ?
(గాలిబ్, అరిస్టాటిల్ తరఫున నీకు నా పాద నమస్కారం )